చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శైలేంద్రకుమార్ అన్నారు. నంద్యాల పట్టణంలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి జిల్లా రీజనల్ 28వ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. బాలుర విభాగంలో వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల, శ్రీశైలం మధ్య జరగగా నంద్యాల విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో కేవీఎస్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కర్నూలు), నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మధ్య జరగగా కేవీఎస్‌ఆర్ విజేతగా నిలిచింది. కబడ్డీ ఫైనల్‌లో బేతంచెర్లపై వాసవీ పాలిటెక్నిక్ కళాశాల (బనగానపల్లె), ఖోఖో బాలికల ఫైనల్‌లో కేవీఎస్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గెలిచింది. బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్‌షిప్ శ్రీశైలం దక్కించుకోగా బాలికల విభాగంలో చాంపియన్‌షిప్ రూపా బేతంచెర్ల నిలిచింది. బాలికల విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఓవరాల్ చాంపియన్‌షిప్ దక్కించుకుంది. పూర్వ విద్యార్థి రామమద్దయ్య, విభాగాధిపతులు రాజేష్, రమణప్రసాద్, రఘునాథరెడ్డి, సురేష్‌బాబు, విద్య హాజరై విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ మార్గరేట్ పాల్గొన్నారు.
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి


