రాజ్యాంగ పరిరక్షణకు కదం తొక్కాలి
కర్నూలు(సెంట్రల్): రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు ముందుకు రావాలని, కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఎస్టీయూ భవన్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ముగింపు వారోత్సావాలను పురస్కరించుకొని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప అధ్యక్షతన వర్తమాన కాలంలో భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు అన్న అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌కు ముఖ్య వక్తగా నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్ హాజరై ప్రసంగించారు. ఎంతో మంది ప్రాణ త్యాగంతో సిద్ధంచిన స్వాతంత్రంతో ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భావించిన భారతదేశానికి బీజేపీ మతతత్వ విధానాలతో పెను ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ..బీజేపీ సర్కారు లౌకిక రాజ్యంగానికి విఘాతం కలిగిస్తుందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ..లేబర్ కోడ్‌ల రద్దు కోసం కార్మిక సంఘాలు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. కార్యకరమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లలితమ్మ, నంద్యాల జిల్లా ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు వి.రఘురాం, మూర్తి, పి.సుంకయ్య, సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, నగర సహాయ కార్యదర్శులు పాల్గొన్నారు


