సారా మానితే ప్రత్యామ్నాయ ఉపాధి
కర్నూలు: ప్రజారోగ్యానికి హాని కలిగించే సారా తయారీ, విక్రయాలను మానుకుంటే ప్రత్యామ్నాయ ఉపాధి చూపుతామని కర్నూలు బంగారుపేటలో నివాసముంటున్న నీలిషికారీలకు ఎకై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు సూచించారు. ఇటీవల రూ.20 లక్షల వ్యయంతో బంగారుపేటలో నీలిషికారి వాసులకు ఆటోలు, కిరాణ దుకాణాలు నిర్వహించుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. ఈ కార్యక్రమానికి ఎకై ్సజ్ జిల్లా అధికారి (ఈఎస్) సుధీర్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణా రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సారా తయారీ, విక్రయదారుల్లో మార్పు తీసుకురావాలన్న ఉదేశంతోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నామని అవగాహన కల్పించారు.


