పెరవలిలో బాలుడి కిడ్నాప్
● సురక్షితంగా నానమ్మ వద్దకు చేర్చిన
పోలీసులు
మద్దికెర: మండల పరిధిలోని పెరవలి గ్రామంలో సోమవారం సాయంత్రం బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలింటి సోమశేఖర్, కవితలకు ఒక కుమారుడు మూలింటి రాజు, కూతురు రాధిక ఉన్నారు. విభేదాల కారణంగా ఆరు నెలల క్రితం పుట్టిల్లు చక్రాళ్లకు కవిత వెళ్లారు. ఇద్దరు పిల్లల్ని నాయనమ్మ వద్ద ఉంది సోమశేఖర్ బతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. ఇదే అదనుగా చూసుకొని పాఠశాలకు వెళ్లి వస్తున్న రాధికను పక్కకు తోసి రాజును ద్విచక్రవాహనంలో కవిత బంధువులు కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని నాయనమ్మకు రాధిక చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. పత్తికొండ పోలీసులు వెంబడించడంతో కిడ్నాపర్లు మోటార్ సైకిల్‌ను, బాలుడిని పత్తికొండ సమీపంలో వదిలి వెళ్లారు. బాలుడిని సురక్షితంగా నానమ్మ వద్దకు పోలీసులు చేర్చారు.
గుర్తు తెలియని యువకుడి మృతి
నందికొట్కూరు: పట్టణంలోని రోడ్డు పక్కన ఈ నెల 11వ తేదీన అనారోగ్యంతో పడిన పోయిన గుర్తు తెలియని వ్యక్తి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుడి చేతిపై ఇంగ్లిషులో ఎన్ అనే అక్షరం ట్యాటు ఉంది. తెలుపురంగు డిజైన్ చొక్కా, ముక్కు, పొట్ట మధ్య భాగంలో నల్లని పుట్టుమచ్చలు ఉన్నాయి. ఎత్తు 5.5, వయస్సు 22 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉంటుంది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీలో మృతదేహం ఉందని, ఆచూకీ తెలిసిన వారు నందికొట్కూరు పోలీసు స్టేషన్‌ను సంప్రందించాలని పోలీసులు తెలిపారు.
ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం
ఆదోని రూరల్: మండలంలోని ఆరేకల్ మెడికల్ కళాశాల సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోని పట్టణంలోని కార్వన్‌పేటకు చెందిన షేక్ నబీసాబ్(41) అనే వ్యక్తి మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడంతో అతడి శరీరం నుజ్జునుజ్జయ్యి గుర్తు పట్టలేనంతగా మారింది. మృతుడికి భార్య సుల్తాన్‌బేగం, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య సుల్తాన్‌బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదోని రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గోడ కూలి
ఆరేళ్ల చిన్నారి మృతి
కర్నూలు(హాస్పిటల్): అకస్మాత్తుగా గోడ కూలడంతో కర్నూలులో ఆరేళ్ల చిన్నారి అకాల మరణం చెందింది. స్థానిక కల్లూరు ఎస్టేట్ ప్రాంతానికి చెందిన నాగార్జున ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండగా ఆయన భార్య సుబ్బమ్మ కూలీ పనులు చేసుకుంటూ భర్తకు తోడుగా ఉంటోంది. వీరికి ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి జన్మించిన ఏకై క కుమార్తె ఉమామహేశ్వరి(6) సోమవారం ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా ఇటుక గోడ కూలి పాపపై పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే పాప మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.
రైతు ఆత్మహత్య
పాణ్యం: కందికాయపల్లె గ్రామానికి చెందిన బిరవోలు రైతు మహానంది (45) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి సోమవారం తెలిపిన వివరాల మేరకు.. మహానందికి స్వగ్రామంలో రెండు ఎకరాల సొంత భూమి ఉంది. ఈ ఏడాది అదనంగా 18 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని కందిపంట సాగు చేశాడు. ఇటీవల అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. కంది చెట్లకు పూత రాలిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆదివారం పొలం వద్ద పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు. డాక్టర్ల సూచనల మేరకు కర్నూలు పెద్దాసుపత్రికి తరలించగా కొలుకోలేక మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య సుబ్బమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
జింక మృతి
దొర్నిపాడు: దొర్నిపాడు శివారులోని పంట పొలాల్లో సోమవారం ఓ జింక మృతి చెందింది. బనగానపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మక్బుల్, పోలీసులు జింక కలేబరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ప్రధాన రహదారిని దాటే క్రమంలో వాహనం ఢీ కొనడంతో గాయపడిన జింక కదలలేక పొలంలోనే ఉండిపోయిందన్నారు. దీంతో కుక్కలు గమనించి దాడి చేసి చంపేసినట్లు తెలుస్తుందన్నారు. పశువైద్యాధికారి చిన్నబాబు పోస్టుమార్టం చేసిన అనంతరం కళేబరాన్ని ఖనం చేశారు.
పెరవలిలో బాలుడి కిడ్నాప్
పెరవలిలో బాలుడి కిడ్నాప్
పెరవలిలో బాలుడి కిడ్నాప్


