గ్రామాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యం
హొళగుంద: గ్రామాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు విధులు నిర్వర్తించాలని సెంట్రల్ ప్రభరి ఆఫీసర్ బంగారరాజు అన్నారు. నీతి అయోగ్ అస్పిరేషన్ బ్లాక్ అయిన హొళగుంద మండలంలో సోమవారం ఆయన పర్యటించారు. హొళగుందలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్య కేంద్రం, జూనియర్ కాలేజ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రైతు సేవా కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయంలో నీతి అయోగ్ సూచించిన 40 అంశాలపై శాఖాలధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, టీచర్ల కొరత, విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పనపై చర్చించారు. ఆయన వెంట ఎంపీడీఓ విజయలలిత, తహసీల్దార్ నిజాముద్దీన్, డాక్టర్ బిందుమాధవి, ఈఓపీఆర్డీ చక్రవర్తి, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్‌గౌడ్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.


