‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
● సాంఘిక సంక్షేమ సాధికారత
అధికారిణి బీ రాధిక
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ ఎస్సీ వసతి గృహాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వంద శాతం మంది ఉత్తీర్ణులయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధిక కోరారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో కర్నూలు సహాయ సంక్షేమాధికారి పరిధిలోని వసతి గృహాల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలపై విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతేడాది సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు వంద శాతం మంది ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో సహాయ సంక్షేమాధికారి బీ మద్దిలేటి, హెచ్‌డబ్ల్యూఓ ప్రమీలారాణి బెస్ట్ అవార్డులను తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ ఏడాది చాలా మంది హెచ్‌డబ్ల్యూఓలు జిల్లా నుంచి బెస్ట్ అవార్డులు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజశేఖరప్ప (ఇంగ్లిషు), హిమకుమార్‌గౌడ్ (లెక్కలు), సుధాకర్ (తెలుగు), లక్ష్మీనర్సయ్య (సైన్స్) విద్యార్థులకు ఉన్న అనుమనాలను నివృత్తి చేశారు. సులభంగా పరీక్షలు రాసే విధానంలో మోటివేటర్స్ మహేంద్ర, గోపీచంద్ మెలకువలను నేర్పించారు. సహాయ సంక్షేమాధికారి బీ మద్దిలేటి, హెచ్‌డబ్ల్యూఓలు సుంకన్న, డీసీ మదారి, బీ రజని, డీపీ సులోచన, కే ప్రమీలారాణి, ఎం వెంకటరెడ్డి, ఆర్ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి


