నిండు జీవితానికి రెండు చుక్కలు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి
కర్నూలు(హాస్పిటల్): నిండు జీవితానికి రెండు పోలి యో చుక్కలు వేసి చిన్నారుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పిలుపునిచ్చారు. కర్నూలు నగరం ఎ.క్యాంపులోని ఇందిరిగాంధీ స్మారక నగర పాలక ఉన్నత పాఠశాలలో ఆదివా రం ఏర్పాటు చేసిన పల్స్‌పోలియో కేంద్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు కలెక్టర్ పల్స్‌పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియోచుక్కలు వేయించడం అందరి బాధ్యత అన్నారు. జిల్లాలో 3,52,000 మంది ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నారని, ఆరు లక్షల వ్యాక్సిన్ డోసులు వచ్చాయని చెప్పారు. కర్నూ లు జిల్లాలో 1,630 బూత్‌లను, ప్రయాణంలో ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒకవేళ ఎవ్వరైనా ఈ రోజు పోలియో చుక్కలు వేయించుకోకపోతే అలాంటి వారికి వైద్య సిబ్బంది 22, 23వ తేదిల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ మా ట్లాడుతూ అందరూ సమిష్టిగా, సమన్వయంతో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నా రు. కార్యక్రమంలో కార్పొరేటర్ పద్మలత, డీఐఓ డాక్టర్ ఉమా, డెమో ప్రకాష్‌రాజు పాల్గొన్నారు.


