ప్రతిభ చాటే క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు
● రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభం
కర్నూలు (టౌన్) : క్రీడల్లో ప్రతిభ చాటే క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్పొరేటర్లు నారాయణ రెడ్డి, దండు లక్ష్మీకాంత రెడ్డి, నాగలక్ష్మీ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో 44 వ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు, మహిళల షూటింగ్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జోసఫ్ మాట్లాడుతూ.. షూటింగ్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో 17 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు వచ్చే ఏడాది జనవరి నెల మొదటి వారంలో మహారాష్ట్రలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. అంతకు ముందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు అతిథులకు కవాతు నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ఒలింపిక్ సంఘం సీఈవో విజయ్‌కుమార్, సెపక్‌తక్రా ఫెడరేషన్ ఇండియా అధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా ఒలంపిక్ సంఘం కార్యనిర్వహక కార్యదర్శి సునీల్ కుమార్, కెవి.సుబ్బారెడ్డి, హనుమంత రెడ్డి, కేడీసీసీ మాజీ డైరెక్టర్ రమణా రెడ్డి, జిల్లా షూటింగ్ బాల్ సంఘం కార్యదర్శి ఈశ్వర్ నాయుడు, రాష్ట్ర షూటింగ్ బాల్ సంఘం ప్రతినిధులు రత్నం, సురేంద్ర పాల్గొన్నారు.


