క్రిమినల్ కేసులపై న్యాయమూర్తులకు వర్క్‌షాప్
కర్నూలు: క్రిమినల్ కేసుల విచారణ, స్వీకరణలపై కర్నూలు జిల్లా ప్రధాన కోర్టులో న్యాయమూర్తులకు శనివారం వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీతాపతి, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్‌ఆర్‌ఏ రోజేదార్ వర్క్‌షాప్ జరిగింది. క్రిమినల్ కేసుల విచారణ, స్వీకరణ, అభియోగాల నమోదు, నిందితుల డిశ్చార్జి, తీర్పులు తదితర అంశాలపై చర్చించారు. న్యాయమూర్తులు పి.కమలాదేవి, పీజే సుధ, డి.అమ్మన్న రాజా, లీలావతి, పి.వాసు, లక్ష్మీరాజ్యం, శోభారాణి, శ్రీవిద్య, రాజేంద్రబాబు, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.


