సీహెచ్‌సీలో నిధుల దుర్వినియోగంపై విచారణ
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రి సీహెచ్‌సీలో సుమారు రూ.5 లక్షల అభివృద్థి నిధుల దుర్వినియోగంపై ఆర్‌డీఎం అండ్ హెచ్‌ఎస్ రామగిడ్డయ్య శనివారం విచారణ చేపట్టారు. సీహెచ్‌సీకి చేరుకున్న రికార్డులు పరిశీలించారు. వైద్యులు షేక్ ఇమ్రాన్, స్టాఫ్ నర్సులు ఉమా, విజయలక్ష్మి, పద్మ, ఎల్‌టీ శ్రీనివాసనాయక్, ఫార్మాసిస్ట్ రాజేష్‌తో వేర్వురుగా విచారించారు. అనంతరం ఫిర్యాదు చేసిన వైద్యురాలు పి.అంజలితో కూడా మాట్లాడారు. విచారణ అనంతరం వారితో నివేదిక ప్రతులపై సంతకాలు చేయించున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణ నివేదికను వైద్యారోగ్య శాఖా మంత్రి పేషికి, రాష్ట్ర ప్రజా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీడీఓ జగదీష్ చంద్రారెడ్డి ఉన్నారు. కాగా నిధులు దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే సీఎం పేషికి ఫిర్యాదు చేస్తానని డాక్టర్ అంజలి తెలిపారు. నిధుల దుర్వినియోగంపై ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేసానని పేర్కొన్నారు.


