ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి
కర్నూలు(సెంట్రల్): ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాయలసీమ విద్యా వంతుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కన్వీనర్ అరుణ్ మాట్లాడుతూ..ఆదోని ప్రాంత ప్రజలకు వలసలు నిత్యం కృత్యమయ్యాయన్నా రు. ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి పథంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆదోని మండలాన్ని శాసీ్త్రయంగా విభజించాలని, ప్రజల కోరిక మేరకు పెద్దతుంబళం మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నాయకులు రామకృష్ణారెడ్డి, నక్కలమిట్ట శ్రీనివాసులు, చాంద్‌బాషా, మనోహర్, శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


