ఇంటి వద్దనే వైద్యం
చిన్నారికి స్పెషలిస్టు వైద్యుడు వైద్య పరీక్షలు చేస్తున్న చిత్రమిది. ఇప్పుడు ఈ దృశ్యాలు గ్రామాల్లో కనిపించడం లేదు. జగనన్న సురక్ష పథకాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పకడ్బందీగా అమలు చేశారు. ప్రతి నెలా గ్రామాల్లో నిపుణులైన వైద్యులతో శిబిరాలు నిర్వహించేశారు. ఇంటి వద్దనే వైద్య సేవలు అందించారు.
– కర్నూలు (హాస్పిటల్)
వర్షాభావ పరిస్థితుల్లోనూ రైతులు పంటలు పండించేలా 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్ జలకళ పథకం కింద బోర్లు వేశారు. అప్పటి ప్రభుత్వమే ఉచితంగా బోర్లను తవ్వించేది. భూగర్భ జలాలు ఎక్కడ ఉన్నాయో అధికారులు ముందుగానే గుర్తించేవారు. వైఎస్సార్ జలకళ బోరును వేసిన తర్వాత సూచనలు చేసేవారు. పాలాల్లో జలకళ సమృద్ధిగా ఉంది అని చెప్పే ఈ చిత్రం ఇదీ. – కర్నూలు (అగ్రికల్చర్)
ఇంటి వద్దనే వైద్యం


