ఖాదర్‌లింగ స్వామికి ప్రత్యేక ఫాతేహాలు
కౌతాళం: మండల కేంద్రమైన కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి జయంతి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. తెల్లవారు జామున ఐదు గంటలకు ప్రత్యేక ఫాతేహలు అనంతరం భక్తుల్ని దర్శనానికి వదిలారు. సాయంత్రం దర్గాలో ప్రత్యేక ఫాతేహల అనంతరం స్వామి చిత్రపటానికి పూలమాల వేసి గ్రామ పూరవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచేకాక మహరాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.
కొనసాగిన ఆచారం
స్వామి చిత్రపటాన్ని గ్రామానికి చెందిన లింగాయితీ వంశస్తులు తలపై మోసుకొని తిరుగుతూ ఆచారాన్ని కొనసాగించారు. ఫక్కీర్లు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఖాదర్‌లింగ స్వామి దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ, పీఠాదిపతి ఖాదర్‌బాషా చిష్తీ, కోరుగోడు దర్గా ధర్మకర్త సయ్యద్ ఖాజాపీర్‌హుసేని చిష్తీ పాల్గొన్నారు.
ఖాదర్‌లింగ స్వామికి ప్రత్యేక ఫాతేహాలు


