జగన్ మామతోనే సాంకేతిక విద్య
ఈ విద్యార్థిని పేరు మౌనిక. ఎమ్మిగనూరు ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. మాజీ సీఎం జగన్ మామ తమ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని ఈ విద్యార్థిని తెలిపారు. అప్పట్లో తనకు ట్యాబ్ ఇచ్చారని, క్లాస్ రూమ్‌ల్లో డిజిటల్ ప్యానల్ బోర్డులు ఏర్పాటు చేసి సాంకేతిక విద్యను అందించారన్నారు. గతంలో తాము క్లాస్ రూమ్‌లో కింద కూర్చునే వారమని, ఇప్పుడు డెస్క్‌లపై కూర్చుంటున్నామని చెప్పారు. తనలాంటి విద్యార్థులెందరికో చదువులపై మరింత ఆసక్తి పెరిగిందన్నారు. – ఎమ్మిగనూరుటౌన్
ప్రాణం నిలిపిన ఆరోగ్యశ్రీ
హొళగుంద ఈబీసీ కాలనీలోని సెంటున్నర స్థలంలో నిర్మించుకున్న సొంతింటిలో నివాసం ఉంటున్న దంపతుల పేర్లు అల్లా ఉద్దీన్, సర్తాజ్‌బేగం. సెంటు భూమికూడా లేని వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అల్లా ఉద్దీన్ బళ్లారిలో లారి డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. భార్య సర్తాజ్‌బేగం ఇంట్లో ఉంటూ పిల్లల బాగోగలను చూసుకుంటూ ఉండేవారు. వీరి ఇద్దరికీ ఒకేసారి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.2 లక్షలు రావడంతో కర్నూలులో 2022లో అల్లా ఉద్దీన్‌కు గుండెకు బైపాస్ సర్జరీ చేశారు. అలాగే సర్తార్‌బేగంకు కర్నూలు విశ్వ భారతి హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ కింద రెండు సార్లు క్యాన్సర్ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఇద్దరు కోలుకుని ఇంటి వద్దే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
– హొళగుంద
నాపేరు కురువ మల్లికార్జున. మాది గోనెగండ్ల మండలం అలువాల గ్రామం నా తల్లిదండ్రులు శరవప్ప, లక్ష్మీదేవి. వీరు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ నన్ను, మా అన్నను చదివిస్తున్నారు. 2020 సంవత్సరంలో డిగ్రీ చదివేటప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం మూడు సంవత్సరాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ వేయడంతో నేను డిగ్రీ పూర్తి చేయగలిగాను. దీంతో మా తల్లిదండ్రులకు భారం తగ్గింది. కానీ నేడు ఆ పరిస్థితి కనబడడం లేదు. దీంతో నిరుపేద విద్యార్థులకు ఫీజుల భారంతో చదువు మానుకునే పరిస్థితి వచ్చింది. – గోనెగండ్ల
జగన్ మామతోనే సాంకేతిక విద్య
జగన్ మామతోనే సాంకేతిక విద్య


