కష్టాలను అధిగమించి..
ఈ చిత్రంలో ఉన్న మహిళ పేరు గుర్రం వాణి. నన్నూరు గ్రామం. ఈమె కూలి పనులకు వెళ్లేవారు. భర్త తిప్పన్న పాలీష్ కట్టింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకురేవారు. ఖర్చుతగ్గట్టు సంపాదన రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడేవారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకాలను సద్వినియోగం చేసుకొని ఈమె లేడీస్ కార్నర్ నిర్వహిస్తున్నారు. చీరల వ్యాపారం చేస్తున్నారు. కష్టాలను అధిగమించి, ఆర్థికంగా స్థిరపడ్డారు.
– ఓర్వకల్లు
ఈ రైతు పేరు కె.నగేష్. కోసిగి మండలం అగసనూరు గ్రామానికి చెందిన ఈయనను 2019 నుంచి 2024 వరకు ఉచిత పంటల బీమా ఆదుకుంది. ప్రీమియం కింద రూపాయి కూడా చెల్లించకపోయినప్పటికీ రూ.లక్ష వరకు పరిహారం పొందినట్లు ఈ రైతు తెలిపారు. తనకు ఐదేళ్లు రైతుభరోసా వచ్చిందని, పంటలు దెబ్బతిన్నపుడు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారని ఈ రైతు చెప్పారు. – కర్నూలు (అగ్రికల్చర్)
జీవనోపాధికి ‘చేయూత’
దుకాణంలో మహిళలకు అవసరమైన గాజులను, పిల్లలకు చిరుతిళ్ల అమ్ముతున్న ఈమె పేరు కటిక రుకియాబీ. మండల కేంద్రమైన సి.బెళగల్లో నివాసం ఉంటున్నారు. పొదుపు మహిళ కావడంతో వైఎస్సార్ చేయుత పథకం కింద ఈమె బ్యాంక్ ఖాతాకు రూ.18,750 నగదు జమ అయ్యింది. గత ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు లేకుండా అర్హులైన వారందరికీ నేరుగా సాయం అందేదని ఈమె తెలిపారు. అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో తమకు జీవనోపాధి లభించిందని చెప్పారు. – సి.బెళగల్
కష్టాలను అధిగమించి..
కష్టాలను అధిగమించి..


