రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

Dec 21 2025 9:32 AM | Updated on Dec 21 2025 9:32 AM

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

పోలియో రహిత సమాజానికి కృషి చేయాలి

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీల పరిష్కార సమాచారం కోసం 1100కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.

కర్నూలు(హాస్పిటల్‌): పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ చెప్పారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి రాజవిహార్‌ వరకు పల్స్‌పోలియో కార్యక్రమ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడే జన్మించిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ వారి వారి తల్లిదండ్రులు విధిగా పోలియోచుక్కలు వేయించాలన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎల్‌.భాస్కర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. వ్యాధినిరోధక టీకా ల అధికారి డాక్టర్‌ ఉమ, రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్‌ మహేశ్వరప్రసా ద్‌, డీపీఎంఓ డాక్టర్‌ శైలేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement