నెరవేరిన సొంతింటి కల
జగనన్న కాలనీలో ఇళ్ల స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణం చేసిన పత్రాన్ని చూపుతున్న ఈమె పేరు డొలు లలితా. పాణ్యం గ్రామానికి చెందిన ఈమె భర్త రామ్ తాపీ మేస్రీగా పనికి వెళ్లి జీవనం సాగించే వాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరికి సొంతిళ్లు లేక 12 సంవత్సరాల పాటు అద్దె ఇంట్లో ఉండేవారు. 2020లో నవరత్నాలు–పేదలకు ఇళ్లులో భాగంగా పాణ్యంలోని మేకల బండ(జగనన్న కాలనీ)లో వీరికి సెంటున్నర ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి అప్పటి ప్రభుత్వమే సామగ్రి అందించింది. తమ కుటుంబానికి రూ. 2లక్షల వరకు ఆర్థిక భరోసా కలిగిందని డొలు లలితా తెలిపారు. పాణ్యంలో 628 మంది పేదల సొంతింటి కల నిజం అయ్యిందని ఆమె చెప్పారు. – పాణ్యం
నెరవేరిన సొంతింటి కల


