ఏపీఎన్‌జీజీవోస్ జిల్లా అడ్‌హాక్ కమిటీ ఏర్పాటు
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీ ఎన్‌జీజీవోస్ కర్నూలు జిల్లా శాఖకు ఎట్టకేలకు తాత్కాలిక అడ్‌హాక్ కమిటీ ఏర్పాటైంది. ఈ నెల చివరిలోపు జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. గురువారం స్థానిక ఎన్‌జీవో హోంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర సహాధ్యక్షులు దస్తగిరిరెడ్డి, వైఎస్‌ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అడ్‌హాక్ కమిటీని ప్రకటించారు. చైర్మన్‌గా నాగరాజు(వాణిజ్యపన్నుల శాఖ), కన్వీనర్‌గా నాగేశ్వరరెడ్డి(ఏఈఓ వ్యవసాయ శాఖ), కోశాధికారిగా లక్ష్మినారాయణ(ఆర్‌డబ్ల్యూఎస్)తో పాటు ఐదుగురిని సభ్యులుగా నియమించారు. అడ్‌హాక్ కమిటీ ఆధ్వర్యంలో తాలూకా ఎన్నికలు కూడా వెంటనే నిర్వహించనున్నట్లు రాష్ట్ర అసోసియేట్ ప్రసిడెంట్ దస్తగిరిరెడ్డి తెలిపారు. ఈ నెల 19న కోడుమూరు, ఎమ్మిగనూరు తాలూకాలకు, 20న ఆదోని, ఆలూరు, పత్తికొండ తాలూకాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఆయా తాలూకాల ఓటర్ల జాబితాను అడ్‌హాక్ కమిటీ ఆమోదించిందన్నారు. తాలూకాల తర్వాత కర్నూలు నగర శాఖ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.


