వంద రోజుల పనిదినాలు చేసిన కుటుంబాలు మండలాల వారీగా.. | - | Sakshi
Sakshi News home page

వంద రోజుల పనిదినాలు చేసిన కుటుంబాలు మండలాల వారీగా..

Dec 14 2025 8:46 AM | Updated on Dec 14 2025 8:46 AM

వంద ర

వంద రోజుల పనిదినాలు చేసిన కుటుంబాలు మండలాల వారీగా..

వంద రోజుల పనిదినాలు చేసిన కుటుంబాలు మండలాల వారీగా..

ఉపాధి పనులకు అరకొర హాజరైన కూలీలు (ఫైల్‌)

చిన్నారులతో కలసి వలస వెళ్తున్న వీరు పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం కోతికొండ గ్రామస్తులు. ఈ ఊరిలో మొత్తం 900 మంది నివాసం ఉంటున్నారు. గ్రామంలో వ్యవసాయ పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఉపాధి పనుల జాడే లేకుండా పోయింది. దీంతో గ్రామం నుంచి ఇప్పటికే 400 మందికిపైగా వలసబాట పట్టారు. ఇంతమంది వలసవెళ్లినప్పటికి ఉపాధి పనులు కల్పించలేదు. మరో 100 మంది వలస వెళ్లారు. త్వరలో గ్రామం ఖాళీ అయ్యే అవకాశం ఉంది.

పొలంలో పత్తి తీస్తున్న ఈ మహిళ పేరు ఉరుకుందమ్మ. కోసిగి మండలం పల్లెపాడుకు చెందిన ఈమెకు రెండు ఎకరాల వరకు భూమి ఉంది. నీటి సదుపాయం లేకపోవడం, వర్షాలు ఒకసారి ఎక్కువగా, మరొకసారి పడకపోవడంతో పొలాన్ని బీడుగా ఉంచారు. గ్రామంలో ఉపాధి పనులు లేకపోవడంతో ఈమె తన భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలసి కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లారు. ఉరుకుందమ్మ ఒక కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. కరువుతో డబ్బుల్లేక పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి ఫీజు కూడా చెల్లించలేదు. కర్ణాటకలో ప్రస్తుతం ఈ మహిళ పత్తి తీస్తున్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి పనులు కరువయ్యాయి. వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు వలసబాట పట్టారు. పనిదినాల సంఖ్య అతి తక్కువగా ఉండటంతో పల్లెలన్నీ ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే జిల్లా నుంచి 1.50 లక్షల కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం కర్నూలు జిల్లాకు కేవలం 58 లక్షలు పనిదినాలు ఇచ్చారు. వీటిని 2026 మార్చి వరకు వినియోగించాల్సి ఉంది. ఇప్పటికే 50.88 లక్షల పనిదినాలను ఉపాధి కూలీలు వినియోగించుకోగా మిగిలింది కేవలం 7.12 లక్షలు మాత్రమే. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ప్రతి ఏటా కోటి పనిదినాలు కల్పించారు. అడిగిన వారందరికీ ‘ఉపాధి’ చూపించారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అధికారులపై ఫిర్యాదులు సైతం వెళ్లాయి.

కర్నూలు జిల్లాలో

1,214 కుటుంబాలకు..

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ మార్గదర్శకాల ప్రకారం జాబ్‌కాార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలి. కర్నూలు జిల్లా ఉమ్మడిగా ఉన్నసమయంలో ఏటా లక్ష కుటుంబాలకు 100 రోజుల పని కల్పించేవారు. విభజన తర్వాత ఒక్కో జిల్లాలో 50 వేల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు తొమ్మిది నెలలు గడచిపోగా కేవలం 1214 కుటుంబాలకు 100 రోజుల పని కల్పించారు. కర్నూలు జిల్లాలోని ఆదోని, పత్తికొండ, కర్నూలు డివిజన్‌లు కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఒక్క ఆదోని డివిజన్‌లో తొమ్మిది నెలల్లో 171 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దినాలు కల్పించడం గమనార్హం.

నంద్యాల జిల్లాలో

1,759 కుటుంబాలకు...

నంద్యాల జిల్లాలో 489 పంచాయతీలు ఉండగా ఈ ఏడాది 58 లక్షల పని దినాలు కేటాయించారు. జాబ్‌కార్డులు 2.56 లక్షలు ఉండగా 4.69 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇప్పటికే 51.19 లక్షల పని దినాలను వినియోగించుకున్నారు. నంద్యాల జిల్లాలో ప్రధానంగా ప్యాపిలి, డోన్‌, బేతంచెర్ల, బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, మిడుతూరు, జూపాడుబంగ్లా తదితర మండలాల్లో ఉపాధి పనులకు డిమాండ్‌ ఉంది. డోన్‌ నియోజకవర్గం పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడింది. ఇప్పటి వరకు 51.19 లక్షల పనిదినాల్లో ఎక్కువ డోన్‌ నియోజకవర్గానికి చెందిన వారు వినియోగించుకున్నారు. నంద్యాల జిల్లాకు మిగిలిన పని దినాలు కేవలం ఏడు లక్షలు మాత్రమే. డోన్‌ నియోజకవర్గంలో ఇప్పటికే వ్యవసాయ పనులు పూర్తి అయ్యాయి. ఉపాధి పనులు లేక వలసబాట పట్టారు. కానీ ఇంతవరకు ఉపాధి పనుల జాడే లేకుండా పోయింది. నంద్యాల జిల్లాలో తొమ్మిది నెలల్లో 1759 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దినాలు కల్పించారు.

ప్రాధాన్యం తగ్గించి

చంద్రబాబు ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యత తగ్గించింది. సాధారణంగా ఒక పని దినం విలువ రూ.511 ఉంటుంది. ఇందులో రూ.307 లేబర్‌ కాంపోనెంట్‌ కింద ఖర్చు చేస్తారు. రూ.204 మెటీరియల్‌ కింద అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తారు. ఉపాధి పనులకు కూలీలు ఎంత మంది వస్తే మెటీరియల్‌ కింద అభివృద్ధి పనులకు కూడ అదేస్థాయిలో అవకాశం ఉంటుంది. చంద్రబాబు సర్కార్‌ చర్యలతో ఉపాధి పనులు కూడా ఇక కరువు అవుతున్నాయి. జిల్లాకు కేటాయించిన పనిదినాల్లో కేవలం 7.12 లక్షలు మాత్రమే మిగిలి ఉండటంతో ఉద్దేశపూర్వకంగానే ప్రజలకు పనులు ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి.

మండలం పనిచేసిన

కుటుంబాలు

ఆదోని 2

పెద్దకడుబూరు 8

ఎమ్మిగనూరు 9

నందవరం 14

గూడూరు 14

కర్నూలు 14

కోసిగి 15

కల్లూరు 21

సి.బెళగల్‌ 21

పత్తికొండ 22

కౌతాళం 25

కృష్ణగిరి 25

కొత్తపల్లి 30

మంత్రాలయం 30

కోడుమూరు 30

ఆస్పరి 32

కొలిమిగుండ్ల 32

నందికొట్కూరు 32

గోనెగండ్ల 33

పగిడ్యాల 36

హొళగుంద 36

దేవనకొండ 36

వెలుగోడు 37

వైఎస్సార్‌సీపీ హయాంలో..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మెటీరియల్‌ కింద పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు అవకాశం ఇచ్చింది. అందువల్లనే అప్పట్లో గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లీనిక్‌లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, డిజిటల్‌ ల్రైబ్రరీలు నిర్మించే అవకాశం ఏర్పడింది. గ్రామాలకు అవసరమైన సదుపాయాలు ఏర్పడ్డాయి. అప్పట్లో ప్రతి ఏటా కర్నూలు జిల్లాకు కోటి పనిదినాలు కల్పించారు. నంద్యాల జిల్లాలో ప్రజలకు అదే స్థాయిలో పనులు ఇచ్చారు.

పని దినాల్లో భారీగా కోత

ఈ ఏడాది 58 లక్షలకే పరిమితం

ఇప్పటికే 50.88 లక్షల వినియోగం

మిగిలింది 7.12 లక్షలు మాత్రమే

మార్చి వరకు పనులు ఉండవు

వలసబాట పట్టిన ప్రజలు

వంద రోజుల పనిదినాలు చేసిన కుటుంబాలు మండలాల వారీగా..1
1/2

వంద రోజుల పనిదినాలు చేసిన కుటుంబాలు మండలాల వారీగా..

వంద రోజుల పనిదినాలు చేసిన కుటుంబాలు మండలాల వారీగా..2
2/2

వంద రోజుల పనిదినాలు చేసిన కుటుంబాలు మండలాల వారీగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement