పింఛన్ల పంపిణీపై విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ పంపిణీపై కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు బృందాలు విచారణ చేపట్టాయి. ప్రతి నెల 1, 2వ తేదీల్లో జరిగే పింఛన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) ద్వారా ఫోన్‌లు వస్తుంటాయి. ఈ సమయంలో పలువురు పింఛన్‌దారులు తమ నుంచి పంపిణీ ఉద్యోగులు డబ్బులు తీసుకుంటున్నారని, సమయానికి ఇవ్వడం లేదని.. మర్యాదగా వ్యవహరించడంలేదని.. అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ అసంతృప్తిదారుల జాబితా చూసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ర్యాండమ్‌గా నాలుగు గ్రామాల్లో విచారణ జరపాలని డీఆర్‌డీఏ పీడీ వైపీ రమణారెడ్డికి ఆదేశాలు అందాయి.ఈ మేరకు కోసిగి మండలంలోని కందుకూరు, కౌతాళం మండలం బాపురం, ఆదోని మండలం నూతనహల్లి, దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామాల్లో డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, పింఛన్ల ఏపీఎం డాక్టర్ అనిల్‌కుమార్, డీపీఎం (ఫైనాన్స్) నవీన్, ఏపీఎం అశోక్ ఇంటింటికి వెళ్లి విచారణ జరిపారు. పింఛన్ల పంపిణీ సమయంలో డబ్బులు తీసుకున్నారా.. అమర్యాదగా వ్యవహరించారా తదితర వాటిపై పింఛన్‌దారుల స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. విచారణకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని డీఆర్‌డీఏ పీడీ తెలిపారు.
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
ఎమ్మిగనూరురూరల్: జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగినట్లు నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి పేర్కొన్నారు. శనివారం పరీక్ష కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్నూలు, నంద్యాల జిల్లాలో 24 పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరిగినట్లు తెలిపారు. మొత్తం 6,469 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 4,548 మంది హజరుకాగా 1,921 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు.
15న కలెక్టరేట్‌లో హైటీ
కర్నూలు (అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 15న కలెక్టరేట్‌లో హైటీ కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సయీద సబిహ పర్వీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సునయన ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధ్యక్షతన కార్యక్రమం నిర్విహిస్తామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, అనధికారులు పాల్గొంటారని, అందరూ హాజరుకావలసిందిగా ఆమె కోరారు.
సుంకేసులకు 14,000 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో
కర్నూలు సిటీ: ఎగువ ప్రాంతాల నుంచి సుంకేసుల జలాశయానికి 14,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. మొత్తం 11,555 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే 2,286 క్యూసెక్కుల నీరు కేసీ కాలువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సుంకేసుల బ్యారేజీ నుంచి 393.59 టీఎంసీలు, కేసీ కాలువకు 24.80 టీఎంసీలు, కర్నూలు పరిధిలోని జనావాసాలకు తాగునీటికి 2.66 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
● కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్
కర్నూలు (హాస్పిటల్): ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంయుక్తంగా ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు. పోలీసు అధికారులకు వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపా రు. ఈ సందర్భంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్‌స్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు. బైక్‌లు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్‌తో వాహనాలు వెళ్లకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని, తదితర రోడ్డు భద్రత ప్రా ముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
పింఛన్ల పంపిణీపై విచారణ


