మద్దిలేటయ్యలో తిరుచ్చి మహోత్సవం
బేతంచెర్ల: మండలంలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో మార్గశిర మాసం శుక్రవారం రాత్రి స్వామి వారికి ఆలయ మాడవీధుల్లో తిరుచ్చి మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు వేదపండితులు జ్వాలా చక్రవర్తి, కల్యాణ చక్రవర్తి, అర్చకులు మద్దిలేటి నరసింహస్వామిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో కొలువుంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారిని ఊరేగించారు. భక్త జనసందోహం, గోవిందనామ స్మరణల నడుమ స్వామి వారు పుష్పాలంకరణ శోభితుడై పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు.


