ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు
ఆస్పరి: మండలంలోని కారుమంచి గ్రామంలో టీటీడీ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ నుంచి చేపట్టిన ధార్మక, ఆధ్మాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి కారుమంచి గ్రామస్తులకు ఆధ్మాత్మిక బోధనలు చేశారు. చివరి రోజు కుంకుమార్చన, గోపూజ, శోభాయాత్ర నగర సంకీర్తన నిర్వహించారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు పెద్ద రంగారెడ్డి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవి, గ్రామ పెద్దలు, టీటీడీ ధర్మ ప్రచార మండలి సభ్యులు మురళిరెడ్డి, కౌలుట్లయ్య, రవిప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.
మందుబాబులకు రూ. 1.30 లక్షల జరిమానా
తుగ్గలి : మద్యం తాగి ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి న్యాయ స్థానం రూ.1.30 లక్షలు జరిమానా విధించింది. శుక్రవారం జొన్నగిరి ఎస్‌ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు..స్టేషన్ పరిధిలోని బెంగళూరు–ఆదోని రహదారిపై నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 13 మందిపై కేసు నమోదు చేసి పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరిచారు. జడ్జి జ్యోత్స్నా దేవి రూ.10వేల చొప్పున 13 మందికి మొత్తం రూ.1.30 లక్షలు జరిమానా విధించారని ఎస్‌ఐ వివరించారు.
జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయం
కర్నూలు కల్చరల్: కర్నూలు ఎన్‌సీసీ గ్రూప్ క్యాడెట్స్ తల్ సైనిక్ శిక్షణ శిబిరంలో మంచి శిక్షణ పొంది జాతీయ స్థాయి శిబిరంలో పాల్గొని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని ఉన్నత స్థాయికి చేర్చడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలానీ అన్నారు. శుక్రవారం కర్నూలు ఎన్‌సీసీ 28వ పటాలం వార్షిక పరిశీలనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కర్నూలు ఎన్‌సీసీ గ్రూప్ అఽధికారులు, శిక్షణ సిబ్బంది మంచి శిక్షణ ఇచ్చి క్యాడెట్లను ఉన్నతంగా తీర్చిదిద్ది దేశ భక్తిని పెంపొదించడం ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కర్నూలు గ్రూప్ ప్రధాన అధి కారి కల్నల్ అలోక్ త్రిపాఠి, పరిపాలన అధికారి శశికుమార్, సూపరింటెండెంట్ జి.కృపా సాగర్, తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు


