ఆర్‌యూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా విశ్వనాథరెడ్డి
● ఆర్‌యూసీఈ ప్రిన్సిపాల్‌గా
ప్రొఫెసర్ సుందరానంద్
ప్రొఫెసర్
వెంకట సుందరానంద్
ప్రొఫెసర్
విశ్వనాథ రెడ్డి
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయంలో పలు విభాగాల డీన్‌లను మార్చి నూతనంగా పలువురు ప్రొఫెసర్లకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. బుధవారం వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్‌కుమార్ నాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీ రెక్టార్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్‌కు స్టూడెంట్ వెల్ఫేర్ డీన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఎంబీఏ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ సి.విశ్వనాథ రెడ్డిని నియమించారు. దీంతో పాటు రీసెర్స్ డీన్‌గా, వర్సిటీ హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ సీవీ కృష్ణారెడ్డిని వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి తప్పించి అకడమిక్ ఎఫైర్స్ డీన్‌గా నియమించారు.
తెలుగు డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ ఎన్.నరసింహులును వర్సిటీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్, వర్సిటీ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ నుంచి తప్పించి ఎగ్జామినేషన్స్ డీన్‌గా నియమించారు.
మ్యాథ్స్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ పి.వెంకట సుందరానంద్‌ను పరీక్షల విభాగం డీన్ నుంచి తప్పించి వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు ఇచ్చారు. దీంతో పాటు సీడీసీ డీన్‌గా, వర్సిటీ హాస్టల్స్ అడిషనల్ వార్డెన్‌గా కొనసాగనున్నారు.
బాటనీ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ ఆర్.భరత్ కుమార్‌ను అకడమిక్ అఫైర్స్ డీన్ నుంచి తొలగించి ఐక్యూఏసీ డైరెక్టర్‌గా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.
ఆర్‌యూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా విశ్వనాథరెడ్డి


