రైతులకు అందుబాటులో ఉండండి | - | Sakshi
Sakshi News home page

రైతులకు అందుబాటులో ఉండండి

Nov 19 2025 6:15 AM | Updated on Nov 19 2025 6:15 AM

రైతులకు అందుబాటులో ఉండండి

రైతులకు అందుబాటులో ఉండండి

వడ్డీ వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం ● రైతులకు పరిహారం ఇవ్వకపోవడంతో ఆర్డీఓ ఆఫీసుఫర్నిచర్‌ వేలానికి ఆదేశం

ఆదోని రూరల్‌: వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సమయానుకూలంగా సూచనలు, సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి ఆదేశించారు. మంగళవారం ఆమె ఆదోని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని మదిరె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిరప సాగుకు ఎంత పెట్టుబడి అవసరం, విత్తనాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు తదితర విషయాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. 60 శాతం పైగా మిరప పంటకు కాయ కుళ్లు, కాయ మచ్చ వచ్చిందని రైతులు కలెక్టర్‌కు చూపించారు. వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతుసేవా కేంద్రాల ద్వారా అవగాహన కల్పి ంచాలని వ్యవసాయ సంబంధిత అధికారులను ఆదేశించారు. పత్తి రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తేమశాతం 14 ఉన్నా కూడా రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్‌ సీసీఐ అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట ఆదోని ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ అజయ్‌, జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి, మార్కెటింగ్‌ ఏడీ నారాయణమూర్తి ఉన్నారు.

13న ‘నవోదయ’ పరీక్ష

ఎమ్మిగనూరురూరల్‌: బనవాసి జవహార్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి డిసెంబర్‌ 13న పరీక్ష జరుగుతుందని ఆ విద్యాలయ ప్రిన్సిపాల్‌ ఇ.పద్మావతి మంగళవారం ఓ ప్రకటలో తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌ టికెట్లను https:// cbsitms. rcil. gov. in/ nvs/ AdminCard నెట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పారు. ఏమైనా సందేహాలుంటే 085212–29454 నంబర్‌కు కాల్‌ చేసి తెలుకోవాలని సూచించారు.

నంద్యాల: వడ్డీ వేధింపులు తాళలేక నంద్యాల పట్టణంలో ఓ మహిళ నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నంద్యాల టూటౌన్‌ సీఐ అస్రార్‌బాషా తెలిపిన వివరాలివీ.. పట్టణంలోని డేనియల్‌పురం కాలనీకి చెందిన మేరి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. భర్త హైదరాబాద్‌లో డ్రైవర్‌. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే కుటుంబ అవసరాల నిమిత్తం పట్టణంలోని సుబ్బారెడ్డి వద్ద రూ.2.50లక్షలు వడ్డీకి తీసుకున్నారు. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నా, అసలుకు రెట్టింపు వడ్డీ అయ్యిందని, అంతా చెల్లించాలని మహిళ ఇంటి వద్దకు వెళ్లి తరచూ వేధిస్తున్నారు. వడ్డీదారుడి వేధింపులు తాళలేక మహిళ తన గృహంలోని గ్యాస్‌ పొయ్యి నిప్పుతో చీర అంటిచుకొని మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. స్థానికులు గమనించి ప్రభుత్వాసుపత్రి కి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

రెవెన్యూ అధికారులపై కోర్టు ఆగ్రహం

కర్నూలు(సెంట్రల్‌) : పదేళ్ల నుంచి రైతులకు పరిహారం ఇవ్వకపోవడంపై కోర్టు తీవ్రంగా పరిగణించింది. రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్నూలు ఆర్డీఓ కార్యాలయ ఫర్నిచర్‌ వేలం వేసి బాధిత రైతులకు పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 2015 కర్నూలు మండలం ఈ.తాండ్రపాడుకు చెందిన 46 మంది రైతుల నుంచి రైల్వే వ్యాగన్‌ కోచ్‌ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు భూసమీకరణ చేశారు. అయితే, ఆ పరిహారం అప్పటి మార్కెట్‌ రేటుకు సరిపోదని కొందరు రైతులు జిల్లా ఆరో అదనపు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు రైతుల పక్షాన పరిహారాన్ని పెంచాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం 2022లో హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు కూడా కింది కోర్టు ఉత్తర్వుల్లోని 50 శాతం పరిహారాన్ని తక్షణమే డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతుల పేరిట ఎలాంటి డిపాజిట్‌ చేయకపోవడాన్ని మంగళవారం న్యాయవాదులు కె.కపిలేశ్వరయ్య, పి.సుంకన్న కర్నూలు ఆరో అదనపు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం పరిహారం రూ.53.22 కోట్ల కోసం ప్రభుత్వానికి నివేదించామని, త్వరలోనే పరిహారం వస్తుందని కోర్టుకు హాజరైన రెవెన్యూ అధికారులు చెప్పగా పరిగణనలోకి తీసుకోలేదు. కర్నూలు ఆర్‌డీఓ కార్యాలయ ఫర్నిచర్‌ను వేలం వేసి బాధిత రైతులకు డిసెంబర్‌ 2వ తేదీలోపు చెల్లించాలని ఆ కోర్టు న్యాయమూర్తి వాసు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement