ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని పాతబస్టాండ్, 2వ వార్డు, 4వ వార్డు పరిధిలోని ప్రాంతాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా వైద్యాన్ని ప్రెవేటు వ్యక్తులకు ఇస్తే సహించేది లేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేద, సామాన్య, మద్య తరగతి వర్గాలు సైతం ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు. వాటిని ప్రైవేటీకరణ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తోందన్నారు. దాదాపు రూ.10 వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఎకరాల కొద్దీ ప్రభుత్వ స్థలాలను కొట్టేసేందుకు కుట్రలు చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు ఉధృతం చేశామన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, 2వ వార్డు పరిధిలోని మైనార్టీ నాయకులు ఫిరోజ్, వలీ, నాగరాజు, రాము, ఆస్లామ్, పుర్ణా, 4వ వార్డు పరిధిలోని కార్పొరేటర్ ఆర్షియా ఫర్హీన్, విక్రమ సింహారెడ్డి, ఆనంద్ రెడ్డి, మహేంద్ర, రైస్ బాబా, రాము, చిట్టిబాబు, శ్రీకాంత్, శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


