పరిహారం కోసం వివరాలను తీసుకున్నాం
ఏపీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ప్రకటించిన పరిహారం ఇచ్చే ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నది. మృతి చెందిన కుటుంబ సభ్యులకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించింది. అయితే ఇందుకోసం బాధిత కుటుంబ సభ్యులు బ్యాంకు ఖాతాలు, ఆధార్, ఇతర వివరాలను తీసుకున్నాం. త్వరలోనే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందుతుంది.
– డాక్టర్ ఏ.సిరి, కర్నూలు జిల్లా కలెక్టర్
నా అల్లుడు శ్రీనివాసరెడ్డి బస్సు దహనంలో చనిపోయాడు. ఆయనకు సెంటు భూమి కూడా లేదు. క్రేన్ మెకానిక్‌గా పనిచేసి జీవనం చేసేవాడు. పనికోసం హైదారాబాద్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి బెంగళూరులో పని కోసం కాల్ వస్తే వెళ్లాడు. అయితే మార్గమధ్యలో ప్రమాదం జరిగి చనిపోయాడు. శ్రీనివాసరెడ్డికి భార్య లక్ష్మీజ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి. లేదంటే వారు రోడ్డున పడతారు.
– అచ్చిరెడ్డి. రావులపాళెం, తూగో జిల్లా
నా కుమారుడు ఆర్గ బంధోపాధ్యాయ చనిపోవడం చాలా బాధ ఉంది. నా భార్య, కుటుంబ సభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. మాది సొంతూరు కలకత్తా. అయితే ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చాం. మా అబ్బాయి బెంగళూరు నుంచి స్నేహితుడు పిలిస్తే దీపావళి పండగకు హైదరాబాద్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో చనిపోవడం అన్యాయం. 23 ఏళ్లకే నూరేళ్లు నిండాయి. పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాం. అవన్నీ కల్లలయ్యాయి.
– అభిజిత్ బంధోపాధ్యాయ, బెంగళూరు
●
పరిహారం కోసం వివరాలను తీసుకున్నాం


