అధ్వాన రోడ్డుపై ప్రజల ఆందోళన
సి.బెళగల్: ప్రధాన రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనాలను అడ్డుకుని ప్రజలు ధర్నా చేపట్టారు. సోమవారం సి.బెళగల్ మండల పరిధిలోని కంబదహాల్ ప్రజలు గ్రామం దగ్గర అధ్వాన రోడ్డు దుస్థితి, ప్రభుత్వ నిర్లక్ష్యపు తీరుపై మండిపడుతూ నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామం దగ్గర ఎమ్మిగనూరు – గూడూరు వెళ్లే ప్రధాన రోడ్డుపై సంవత్సర కాలంకు పైగా దాదాపు మీటరున్నర గోతులు ఏర్పడ్డాయి. ప్రమాదకరంగా మారడంతో రోడ్డును బాగు చేయాలని అధికారులకు, టీడీపీ నేతలకు చెప్పి పట్టించుకోకపోవడంతో సోమవారం ప్రజలు ధర్నా చేశారు. దీంతో మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వాహనాలు ఆగిపోయాయి. ప్రజా నిరసనకు గ్రామ రైతులు, యువకులు, విద్యార్థులు, ప్రయాణికులు మద్దతు తెలిపారు. ధర్నా అనంతరం మండల కేంద్రం సి.బెళగల్‌కు చేరుకుని తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ రాణెమ్మ, ఎస్‌ఐ పరమేష్ నాయక్‌కు ప్రజలు వినతిపత్రాలు ఇచ్చారు.
ఆత్మ పీడీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీలత
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా శ్రీలత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఏడాది జూన్ వరకు ఇక్కడే ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. అనంతరం ఎమ్మిగనూరు ఫామ్ డీడీఏగా బదిలీ అయ్యారు. అక్కడ నాలుగు నెలల పాటు పనిచేశారు. ఇటీవల శ్రీలతకు జేడీఏగా పదోన్నతి లభించింది. పదోన్నతిపై ఖాళీగా ఉన్న ఆత్మ పీడీ పోస్టులో నియమిస్తూ ఇటీవల వ్యవసాయ శాఖ ఉత్తుర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు.
అధ్వాన రోడ్డుపై ప్రజల ఆందోళన


