
నవంబర్ 2న కురువల కార్తీక వనభోజనాలు
కర్నూలు(అర్బన్): జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 2న స్థానిక పెద్దపాడు రోడ్డు ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న భీర లింగేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి తెలిపారు. కార్యక్రమ కరపత్రాలను మంగళవారం పంచలింగాల గ్రామంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక వన భోజన కార్యక్రమానికి మంలో జిల్లాలోని కురువలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న, మ హిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ, ప్రధాన కార్య దర్శి అనిత,నాయకులు ధనుంజయ, బీ వెంకటేశ్వర్లు, పాల సుంకన్న, కేసీ నాగన్న, శ్రీనివాసులు, బి తరుణ్, చిరంజీవి, మద్దిలేటి, బాలరాజు పాల్గొన్నారు.