
డెంగీతో చిన్నారి మృతి?
పత్తికొండ : డెంగీ జ్వరంతో చిన్నారి మృతి చెందిన సంఘటన మంగళవారం పత్తికొండ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని కొండగేరికి చెందిన శ్రీలక్ష్మి, రవి దంపతుల పెద్ద కుమార్తె కావ్య(7) రెండు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో సోమవారం పత్తికొండ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ వైద్యులు చికిత్స నిర్వహించి రక్తకణాలు పూర్తిగా తగ్గిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. బాలిక తల్లిదండ్రులు వెంటనే కర్నూలు ప్రభుత్వ అసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కోలుకోలేక మంగళవారం మృతి చెందింది. చిన్నారి మృతితో బాలిక కుటుంబీకుల రోదనలతో పలువురు కంటతడి పెట్టారు.