
వడ్డీరేట్లు భారీగా తగ్గింపు
కర్నూలు(అగ్రికల్చర్): స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వెహికల్, పర్సనల్ లోన్‌లపై వడ్డీ రేట్లు తగ్గించిందని, ఈ అవకాశాన్ని ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ట్రెజరీ శాఖ చీఫ్ మేనేజర్ భాస్కరవర్మ తెలిపారు. కారు లోన్‌లపై ఇప్పటి వరకు 9.45 శాతం వడ్డీ రేటు ఉందని, దీనిని 8.75 శాతానికి తగ్గించినట్లు మంగళవారం విలేకర్లకు తెలిపారు. పర్సనల్ లోన్‌లపై వడ్డీరేటు 13.50 వరకు ఉండగా.. దీనిని 10.75 శాతానికి తగ్గించామన్నారు. ఈ రుణాల మంజూరుకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదన్నారు. ఈ అవకాశం పర్సనల్ లోన్‌లకు సంబంధించి నవంబరు నెల చివరి వరకు, కారు లోన్‌లు డిసెంబర్ చివరి వరకు మాత్రమే అవకాశం ఉందన్నారు.
అన్నా చెల్లెలు టీచర్లు.. ఒకే పాఠశాలలో విధులు
తుగ్గలి: ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికై న అన్నా చెల్లెలు చివరకు ఒకే పాఠశాలలో పోస్టింగ్ పొందారు. ఆత్మకూరుకు చెందిన బాలస్వామి (హెచ్‌ఎం), నాగమణి దంపతుల కుమారుడు, శ్యామూల్ రాజు, కుమార్తె సారాపింకి కొత్తగా ఉపాధ్యా య ఉద్యోగాలు పొందారు. ఒకేసారి ఉద్యోగా లు పొందడమే కాకుండా ఒకే పాఠశాలలో టీచర్లుగా చేరడం విశేషం. మండలంలోని హు సేనాపురం ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయులుగా మంగళవారం విధుల్లో చేరారు. వీరి సోదరి మౌనిక కూడా అమలాపురంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నట్లు శ్యామ్యూల్ రాజు, సారాపింకి తెలిపారు. ఒకే పాఠశాలలో ఇద్దరం విధుల్లో చేరడం ఆనందంగా ఉందని, విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు.
నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
కర్నూలు(అగ్రికల్చర్): వివిధ డిమాండ్‌లను సాధించుకునేందుకు చేపట్టిన పోరాటాన్ని వి ద్యుత్ ఉద్యోగులు మరింత తీవ్రం చేయనున్నా రు. మంగళవారం వర్క్‌టురూల్ చేపట్టారు. నిర్ణీత పనివేళలకు విధులకు హాజరై నిర్ణీత సమయానికి వెళ్లారు. ఇటు కూటమి ప్రభుత్వం నుంచి అటు విద్యుత్ సంస్థల నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు మంగళవారం సాయంత్రం ఏపీ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి జిల్లా చైర్మన్ సతీష్‌కుమార్ తెలిపారు.
23 సంఘాలతో జేఏసీ ఏర్పాటు
డిమాండ్‌ల సాధనకు ఏపీ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. ఇందు లో 1104,327, డిప్లమా ఇంజినీర్స్, బీసీ, ఓసీ, బహుజన ఉద్యోగ సంఘాలు మొత్తం 23 సంఘాలు జేఏసీలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 4వేల మంది విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏఈఈ(బీటెక్) నుంచి ఏడీఈలు, డీఈఈ, ఎస్‌ఈఈ, ఇతర గెజిటెడ్ అధికారులు మాత్రం సమ్మెలో ఉండరని సమాచారం.

వడ్డీరేట్లు భారీగా తగ్గింపు