
అంకితభావంతో విధులు నిర్వహించాలి
కర్నూలు కల్చరల్: అటవీ శాఖ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆ శాఖ కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐఎఫ్‌ఎస్ బీవీఏ కృష్ణ మూర్తి అన్నారు. మంగళవారం ఆయన డీఎఫ్‌వో శ్యామలతో కలిసి కర్నూలు డివిజన్ ఎఫ్‌ఆర్‌వో, డీఆర్‌వోలతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు నగరవనం, విజయ వనం, పుల్లయ్య పార్క్‌లను అభివృద్ధి చేయాలన్నారు. వివిధ స్కీంల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. అటవీ భూ ముల ఆక్రమణలను అడ్డుకోవాలని, వన్యప్రాణులను సంరక్షించాలని ఆదేశించారు. ఉద్యోగులు విధులు నిర్వహించే చోటే నివాసం ఉండాని, వేరో చోట ఉంటే చర్యలు తప్పవన్నారు. సర్కిల్ కార్యాలయం ఏవో అబ్దుల్ సుభాన్, కర్నూలు ఏవోలు మహమ్మద్ హెసాన్, చంద్రశేఖర్, ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ అధికారి రమణారెడ్డి, ఎఫ్‌ఆర్‌వోలు విజయకుమార్, తేజశ్వి, డీఆర్‌వోలు ఓబులేస్, లక్ష్మయ్య పాల్గొన్నారు.