
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు పచ్చి బూతులు
ఫ్లెక్సీని చించివేశారంటూ టీడీపీ నేతపై దుర్భాషలు
సాక్షి, కర్నూలు జిల్లా: అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ముఖ్య అనుచరుడిపై బూతులతో విరుచుకుపడ్డారు. ‘ఏరా ల..కొడుకా.. నా ఫ్లెక్సీని చించమని చెప్పింది ఎవరు?’ అంటూ దుర్భాషలాడారు. గుమ్మనూరు జయరాం ఆలూరులోని ఉపాధ్యాయనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 16న జయరాం పుట్టిన రోజు సందర్భంగా ఆలూరులోని ఆర్ అండ్ బీ అతిథిగృహం ఎదుట రెండు రోజుల కిందట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
సోమవారం రాత్రి ఈ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. జయరాం మంగళవారం ఆర్ అండ్ బీ అతిథిగృహానికి చేరుకోగా.. ఫ్లెక్సీని చించివేసిన విషయం అనుచరులు ఆయనకు తెలియజేశారు. వెంటనే ఆయన కారు దిగి ఎదురు షాపులో ఉన్న జ్యోతి ముఖ్య అనుచరుడు రహిమాన్‌ను పిలిచి ‘ఏరా ల..కొడుకా.. నా ఫ్లెక్సీని చించమని చెప్పింది ఎవరు?’ అంటూ దుర్భాషలాడారు. తమ పారీ్టకే చెందిన నాయకుడిని టీడీపీ ఎమ్మెల్యే పచ్చి బూతులు తిట్టడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. జయరాం హడావుడి కారణంగా దాదాపు 15 నిమిషాలు కర్నూలు–బళ్లారి రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.