
శిశు గృహకు ఆపేక్ష
కర్నూలు(అర్బన్): స్థానిక ప్ర భుత్వ సర్వజన వైద్య శాలలో గత నెల 26న గుర్తించిన ఆపేక్షను మంగళవారం సి.క్యాంప్ సెంటర్‌లోని శిశు గృహకు చేర్చినట్లు ఐసీడీఎస్ పీడీ పి.విజయ తెలిపారు. ఆడ శిశువును తల్లిదండ్రులు హాస్పిటల్‌లోనే వదలి వెళ్లారని, స్వల్ప అనారోగ్యంతో ఉన్న శిశువుకు వైద్యం అందించి, బాలల సంక్షేమ సమితి ఉత్తర్వుల మేరకు తమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక దత్తత సంస్థ (శిశు గృహ)కు చేర్చి సంరక్షిస్తున్నట్లు తెలిపారు. శిశువును తమ చిన్నారిగా రుజువు చేసేందుకు తగిన సాక్ష్యాధారాలతో జన్మనిచ్చిన తల్లిదండ్రులు, సంబంధీకులు 30 రోజుల్లోపు సంప్రదించాలన్నారు. లేని పక్షంలో ‘వదిలేసిన శిశువు’గా ప్రకటించి కారా, న్యూఢిల్లీ దత్తత నిబంధనల మేరకు దత్తత ఇస్తామన్నారు.