
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన ఉప్పరి రవితేజ సోమవారం రాత్రి స్నేహితులను బైక్‌పై హైవే–44పై అమకతాడు టోల్‌ప్లాజా వద్ద డ్రాప్ చేశాడు. తిరుగుప్రయాణంలో లద్దగిరి రహదారిలో గుర్తు తెలియని వాహనం బైక్‌ను కొనడంతో రవితేజ మృతిచెందాడు. మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెల్దుర్తి సీహెచ్‌సీకి తరలించారు. మృతుడి తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.