
బనవాసి ఏఓ ఆన్‌డ్యూటీపై బదిలీ
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ బనవాసి ఫామ్‌లో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న శారదమ్మ ఆన్ డ్యూటీపై కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి బదిలీ అయ్యారు. హాలహర్వి ఏఓగా పనిచేస్తున్న వేదానందం బనవాసి ఫామ్‌కు బదిలీ అయిన నేపథ్యంలో ఆ స్థానంలో ఉన్న శారదమ్మ డిప్యుటేషన్‌పై కర్నూలు డీఏఓ కార్యాల యం సాంకేతిక ఏఓగా బదిలీ అయ్యారు. ఈమె ఈ ఏడాది జూన్ వరకు ఇక్కడ పనిచేసి బనవాసి ఫామ్‌కు బదిలీ అయ్యారు. తాజాగా డిప్యుటేషనన్‌పై మళ్లీ ఇక్కడకు బదిలీ కావడం విశేషం. కాగా మంత్రాలయం అగ్రీ ల్యాబ్ ఏఓ అనిల్‌కుమార్ కూడా ఆన్ డ్యూటీపై డీఏఓ కార్యాలయానికి బదిలీ కానున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.
కొత్తిమీర పంటపై
గడ్డి మందు పిచికారీ
ఎమ్మిగనూరురూరల్: మండల పరిఽధిలోని రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన రైతు సలాం సాగు చేసిన ఎకరా కొత్తిమీర పంటకు గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేశారు. రూ.60 వేలు పెట్టుబడి పెట్టి సాగుచేశానని, చేతికొచ్చే సమయంలో ఓర్వలేని వారు గడ్డి మందు పిచికారీ చేయటంతో పంట పూర్తిగా ఎండిపోయిందని రైతు వాపోయాడు. దాదాపు రూ.2 లక్షల వరకు తనకు నష్టం వచ్చిందని, దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు కోరాడు.
బస్సు కింద పడివిద్యార్థికి గాయాలు
ఎమ్మిగనూరు రూరల్: స్థా నిక ఆర్టీసీ బ స్టాండ్ ఆవరణలో మంగళవారం సా యంత్రం బడి బస్సు కింద పడి ఓ విద్యార్థి గాయ పడ్డాడు. వివరాలు.. మండల పరిధిలోని వెంకటగిరి గ్రామానికి చెందిన తిమ్మప్ప, అనితల కుమారుడు శివశంకర్(13) పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. రోజూ గ్రామం నుంచి బడి బస్సులో రాకపోకలు సాగిస్తున్నా డు. సాయంత్రం వెంకటగిరికి వెళ్లే బడి బస్సు రావటంతో పరిగెత్తుకుంటూ విద్యార్థులు వెళ్తుండగా శివశంకర్ అదుపుతప్పి బస్సు వెను క చక్రం కింద పడ్డాడు. కుడి తొడపై చక్రం ఎక్కటంతో తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కర్నూలు(అర్బన్): 2025–26 విద్యా సంవత్సరంలో ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు మొదటి సంవత్సరం చదువుతున్న మాజీ సైనికుల పిల్లలకు ప్రధానమంత్రి ఉపకార వేతనాలను అందించనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి ఎస్‌ఆర్ రత్నరూత్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్ణీత దరఖాస్తును వెబ్‌సైట్ అడ్రస్ ఠీఠీఠీ.జుట ఛ.జౌఠి.జీ ుఽ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే డిసెంబర్ 31లోగా అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

బనవాసి ఏఓ ఆన్‌డ్యూటీపై బదిలీ