
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకుల మృతి
బేతంచెర్ల/వెల్దుర్తి: వేర్వేరు ప్రమాదాల్లో మంగళవారం ఇద్దరు యువకులు మృతి చెందారు. బలపాలపల్లె గ్రామ సమీపంలోని జిందాల్ కంపెనీలో టిప్పర్ ఢీకొని బేతంచెర్ల బైటిపేట కాలనీకి చెందిన శ్రీకాంత్(30), బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో రామళ్లకోటకు చెందిన ఉప్పరి రవితేజ(25) మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీకాంత్‌రెడ్డి ఆరేళ్లుగా జిందాల్ కంపెనీలోని ఎంఎస్‌ఆర్ మైన్స్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఉదయం టిప్పర్ మరమ్మతులకు గురి కావడంతో బాగు చేయించడానికి బేతంచెర్లకు బయలుదేరారు. మార్గమధ్యలో మెట్ట వద్ద టిప్పర్ నుంచి శబ్దం రావడంతో నిలిపి డోర్ వెనుక పరిశీలిస్తుండగా టిప్పర్ ఒక్కసారిగా వెనక్కి రివర్స్ అయి శ్రీకాంత్ ఛాతీని ఢీకొంది. విషయం తెలుసుకున్న కంపెనీ అధికారులు హుటాహుటిన శ్రీకాంత్‌రెడ్డిని కర్నూలు ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.