
యువకుడి ఆత్మహత్య
ఆదోని సెంట్రల్: మండల పరిధిలోని మదిరె గ్రామానికి చెందిన గంపల ఈరప్ప కుమారుడు కొరియా గంపల సోమ(31) మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్‌ఐ గోపాల్ తెలిపిన వివరాలు.. సోమ ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కూతురు ఉంది. మగ సంతానం లేదని మనోవేదనతో మధ్యాహ్నం ఇస్వీ రైల్వే స్టేషన్ సమీపంలోని 501/18–20 కిలో మీటరు నంబర్ వద్ద గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరు కుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమో దు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ల అడ్డగింత
మంత్రాలయం: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను మంత్రాలయంలో పాఠశాల చైర్మన్, విద్యార్థులు కలిసి అడ్డుకున్నారు. కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. తుంగభద్ర నది నుంచి దాదాపు 30 ట్రాక్టర్లలో ఇసుకను మండల కేంద్రంలోని సంత మార్కెట్‌లో ఉన్న ఎంపీయూపీ పాఠశాల ఆవరణంలో నుంచి అక్రమంగా తరలిస్తుడడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన పాఠశాల చైర్మన్ సున్నం గురురాజు మంగళవారం ట్రాక్టర్లను నిలిపివేశాడు. ఇటు ట్రాక్టర్లను తిప్పవద్దని ఎన్ని సార్లు చెప్పినా వినకపోడంతో రోడ్డుకు అడ్డంగా ఎద్దుల బండ్లను నిలిపి ట్రాక్టర్లను నిలిపి వేశామని, ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి ఇసుక ట్రాక్టర్లను ఇటు వైపు రాకుండా చూడాలని కోరారు.

యువకుడి ఆత్మహత్య