
● పట్నమెళ్లిపోతున్న పల్లెలు!
రెక్కల కష్టం వర్షార్పణమైంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. కనీసం చేసేందుకు కూడా ఉన్న ఊళ్లో పని లేదు.. ఊరకే ఉంటే తినడానికి తిండి దొరకదు. అందుకే కడుపు చేతపట్టుకుని వలస బాట పడుతున్నారు పశ్చిమ ప్రాంతవాసులు. నందవరం మండలం పూలచింత గ్రామానికి చెందిన దాదాపు 20 కుటుంబాలు మంగళవారం పిల్లాపాపలతో కలిసి మూటాముల్లె సర్దుకుని తెలంగాణ రాష్ట్రానికి వెళ్లగా.. ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన మరో పది కుటుంబాలు కర్ణాటక రాష్ట్రానికి పత్తి తీసే పనులు కోసమంటూ బయలుదేరారు. కొన్ని రోజుల నుంచి పల్లెలు వలస బాట పడుతున్నా అధికారులు మాత్రం గుడ్లప్పగించి చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – నందవరం