
గిట్టుబాటు ధరలేక ఉల్లి పంట తొలగింపు
తుగ్గలి: మార్కెట్‌లో ఉల్లిగడ్డలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రాతన గ్రామానికి చెందిన రైతు ఏటిగడ్డ వెంకప్ప సోమవారం పంటను ట్రాక్టర్ పల్టర్‌తో దున్నేశారు. ఏడెకరాలలో సుమారు రూ.4 లక్షలకు పైగా పెట్టుబడి ఉల్లి పంట సాగు చేస్తే ఇప్పుడు కొనేవారు లేరని రైతు వాపోయారు. ఇప్పుడు పంటకోసి గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు తీసుకెళ్లాలంటే మరో రూ.2లక్షల దాకా అవుతుందని, క్వింటాకు ఐదారు వందలకు మించి ధర లేదన్నారు. ఇంత ఖర్చుచేసినా కూలీల ఖర్చులు కూడా రావని దున్నేశానని చెప్పారు. క్వింటా ధర రూ.3వేల నుంచి రూ.4వేలు ఉంటేనే గిట్టుబాటు అవుతుందన్నారు. ప్రభుత్వం హెక్టారుకు రూ.50వేలు పరిహారం ఇచ్చి ఆదుకుంటామని చెప్పినా ఇంత వరకు ఇవ్వలేదన్నారు.
రూ. 1.60 కోట్లతో దేవాలయాల పునర్నిర్మాణం
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రం వద్ద ఆంజినేయస్వామి, బసవన్న ఆలయాలను 1.60కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. సోమవారం వేదపండితులు, అర్చకులు పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోతట్టులో ఉండడంతో బసవన్న గుడిని రూ. 43లక్షలతో, ఆంజినేయస్వామి ఆలయాన్ని రూ. 1.15కోట్లతో పునర్నిర్మిస్తున్నట్లు చెప్పారు. వేద పండితుడు మురళికృష్ణపండిత్, ప్రధాన, ఉపప్రధాన అర్చకులు ఈరప్పస్వామి, మహదేవస్వామి పాల్గొన్నారు.
నేటి నుంచి న్యాయవాదుల విధుల బహిష్కరణ
కర్నూలు(సెంట్రల్): కర్నూలులో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం నుంచి మూడు రోజులపాటు విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హరినాథ్ చౌదరి, ఎం.వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయవాదుల అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వ తీరుతో కర్నూలుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధకశాఖలో కర్నూలు డివిజన్ డీడీగా పనిచేస్తూ జేడీగా పదోన్నతి పొంది డైరెక్టరేట్‌కు బదిలీ అయిన డాక్టర్ దుర్గాప్రసన్నబాబును సోమవారం కర్నూలులోని బహుళార్ధ పశువైద్యశాల ప్రాంగణంలో సన్మానించారు. ఉమ్మడి జిల్లాకు 2005 నుంచి డాక్టర్ దుర్గాప్రసన్నబాబు అందించిన సేవలను ఎప్పటికి మరచిపోలేమని అన్నారు. కర్నూలు, ఆదోని డీడీలు హేమంత్‌కుమార్, వెంకటరమణ, ఏడీలు డాక్టర్ నాగరాజు, భవానిశంకర్‌రెడ్డి, ధనుంజయుడు, పార్థసారిథి, వెటర్నరీ అసిస్టెంటు సర్జన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు గిడ్డయ్య, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

గిట్టుబాటు ధరలేక ఉల్లి పంట తొలగింపు