
హాస్టల్ నుంచి వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థులు
పత్తికొండ: ఉపాధ్యాయులకు చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయిన ఇద్దరు విద్యార్థులు తిరిగి మళ్లీ వచ్చారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. పత్తికొండ పట్టణంలోని పుచ్చకాయలమాడ గ్రామ రహదారిలో ఉన్న బాలురు గురుకుల పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థులు దనుష్, ప్రణిత్‌లు ఉదయం హాస్టల్ నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. రోల్‌కాల్ సమయంలో వ్యాయామ ఉపాధ్యాయుడు గుర్తించి పిల్లల లేరన్న విషయంపై ప్రిన్సిపాల్‌కు తెలిపారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో తప్పిపోయిన విద్యార్థులు వివరాలతో ఫొటోలతో పాటు ఫోన్ నంబర్లును ఇచ్చి సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. ఆస్పరి మండలం బిల్లేకల్ గ్రామం దగ్గర ఎమ్మిగనూర్ వైపు నడుచుకుంటూ వెళ్లుతున్న విద్యార్థులను స్థానికులు గుర్తించారు. వారినే అక్కడ ఉంచుకుని గురుకుల పాఠశాల సిబ్బందికు సమాచారం ఇచ్చారు. ఉపాధ్యాయులు అక్కడికి చేరుకోని విద్యార్థులను గురుకుల పాఠశాలకు తీసుకోచ్చారు. దాదాపు రెండు గంటల వ్యవధిలోనే 20 కిలోమీటర్లు దూరం పైగా నడుచుకుంటూ వెళ్లారు. సోషల్‌మీడియాలో వారి ఫొటోలు చూసి గుర్తుపట్టి విద్యార్థులను గురుకుల పాఠశాల సిబ్బంది, తల్లితండ్రులకు అప్పచేప్పడంతో కథ సుఖాంతమైంది.