
ఆత్మీయ కలయిక..ఆనంద డోలిక!
ఆలూరు రూరల్: గుర్తుకొస్తున్నాయ్.. అంటూ 27 ఏళ్ల తర్వాత వారంతా కలుసుకున్నారు. పట్టణంలోని ఎల్లార్తి రోడ్డులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల 1997–98 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించా రు. స్నేహితులంతా ఒకేచోట చేరడంతో కుశల ప్రశ్న లు వేసుకొని ఉల్లాసంగా గడిపారు. నాటి స్మృతుల ను గుర్తుకు తెచ్చుకొని, మళ్లీ చిన్నపిల్లలైపోయారు. అలాగే నాడు వారికి విద్యాబుద్ధులు చెప్పిన గురు వులు రుక్మిణి, రమణయ్య, మహబూబ్ సాబ్‌ను ఘనంగా సత్కరించారు. నాటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో సరస్వతి ఆలయం నిర్మించడం అభినందనీయం అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులకు షీల్డులు అందజేశారు.