వలసబాట పట్టిన ఆగవేళి | - | Sakshi
Sakshi News home page

వలసబాట పట్టిన ఆగవేళి

Oct 13 2025 7:38 AM | Updated on Oct 13 2025 7:38 AM

వలసబా

వలసబాట పట్టిన ఆగవేళి

కోడుమూరు రూరల్‌: కృష్ణగిరి మండలంలోని ఆగవేళి గ్రామానికి చెందిన సుమారు 100మందికి పైగా వ్యవసాయ కూలీలు బతుకు తెరువుకోసం ఆదివారం ఆరు బొలేరో వాహనాల్లో గుంటూరుకు వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ కూలీలు కోడుమూరులో తమ వాహనాలను ఆపుకుని కిరాణా సరుకులు, తిండిగింజలను కొనుగోలు చేసుకుని వెళుతూ కన్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలకు సాగు చేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయని, ఉన్న ఊర్లో చేసేందుకు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గుంటూరులో పనులున్నాయని కొందరు చెప్పడంతో అక్కడికి వెళుతున్నామని చెప్పారు.

వలసబాట పట్టిన ఆగవేళి 
1
1/1

వలసబాట పట్టిన ఆగవేళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement