శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్ర సందర్శనకు ఈ నెల 16న భారత ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో భద్రత పరంగా పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్ బలగాలతో శనివారం ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, శ్రీశైలం సీఐ జి.ప్రసాదరావు ఆధ్వర్యంలో శ్రీశైల ఆలయం, ఆలయ పరిసరాలు, హెలిపాడ్, నల్లమల అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. అంతకు ముందు స్థానిక పోలీసు స్టేషన్‌లో గ్రేహౌండ్స్ బలగాలకు ప్రత్యేక సూచనలు చేశారు. ప్రధాని పర్యటన ముగిసేంత వరకు నల్లమల అడవుల్లో కూంబింగ్ నిర్వహించడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు.