
ముగతి పేటలో చోరీ
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ముగతి పేటలో శనివారం చోరి జరిగింది. కాలనీకి చెందిన యూసూఫ్ ఆటో మోకానిక్‌గా పనిచేస్తున్నాడు. భార్యకు ఆరోగ్యం బాగలేకపోతే ఆదోనిలోని ఓ హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నాడు. రోజూ ఆదోనికి వెళ్లి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆదోనికి వెళ్లి శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బీరువాలో ఉన్న 12 తులాల బంగారు, కేజీ వెండి, రూ. 70వేలు నగదు చోరీకి గురైనట్లు యూసుఫ్ తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారిస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.