
పరుగు పోటీలో ట్రాన్స్‌జెండర్ ఘనత
రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యూత్ ఫీస్ట్ మారథాన్–5 కి.మీ పరుగు పోటీలో కర్నూలు జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్ లీలా ప్రసాద్ రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి కై వసం చేసుకున్నారు. ఈ పోటీలలో పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెంటర్లు కలిపి 130 మంది పాల్గొనగా లీలా ప్రసాద్ ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నీలకంఠారెడ్డి, అదనపు పీడీ డాక్టర్ సుచిత్ర, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మంజుల చేతుల మీదుగా రూ.25 వేల నగదు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు లీలా ప్రసాద్ అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో కర్నూలు జిల్లాకు ద్వితీయ స్థానం రావడం పట్ల లీలా ప్రసాద్‌ను డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.శాంతికళ, జిల్లా ఏయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్, ఏపీ సాక్స్ క్లస్తర్బ్ ప్రోగ్రామ్ మేనేజర్ అలీ హైదర్ అభినందించారు.