
న్యాయ సేవలపై అవగాహన పెంచుకోవాలి
కర్నూలు(సెంట్రల్): న్యాయ సేవలపై పారా లీగల్ వలంటీర్లు అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్థి సూచించారు. గురువారం న్యాయ సదన్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మణ్ వెంటక హరినాథ్ ఆధ్వర్యంలో పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా బాల్య వివాహాల నిరోధక చట్టం, వరకట్న నిషేధం, కార్మిక సంక్షేమ చట్టం, వినియోగదారుల రక్షణ చట్టం, రెవెన్యూ చట్టాలను వివరించారు. లోక్ అదాలత్‌లో తగదాలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని, ఈ తీర్పులపై అప్పీలుకు వీలుండదని, చెల్లించిన కోర్టు ఫీజును కూడా తిరిగి ఇవ్వనున్నట్లు వివరించారు. న్యాయ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వలంటీర్లకు సూచించారు.

న్యాయ సేవలపై అవగాహన పెంచుకోవాలి