
‘బంగారు’ కాంతులు!
విద్యుత్ కాంతుల మధ్య
ప్లాంట్
మండలంలోని జొన్నగిరి, బొల్లవానిపల్లి, పగిడిరాయి గ్రామాల మధ్య జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ కంపెనీ ప్రాసెసింగ్ ప్లాంట్ రాత్రి పూట విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. 30 ఎకరాల్లో దాదాపు రూ.200 కోట్లతో గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మించారు. ప్లాంట్ లోపలి భాగంలో చుట్టూ పచ్చని గడ్డితో పాటు మొక్కలు నాటారు. అధునాతన హంగులతో ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ఈనెలఖారు నుంచి ప్లాంట్‌లో బంగారం ఉత్పత్తి మొదలు కానుండటం విశేషం. –తుగ్గలి