
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ప్రదక్షిణలు
ఈ చిత్రంలో కనిపించే రైతు పేరు ఎర్రిస్వామి, మద్దికెర మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన సన్నకారు రైతు. ఈయన వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో బోరు వేయించుకున్నాడు. నీళ్లు కూడ పడ్డాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ అధికారులు వేసిన ఎస్టిమేట్ ప్రకారం నాన్ సబ్సిడీ అమౌంటు కూడ చెల్లించారు. పోల్స్ వేసి డీపీ కూడ పెట్టారు. నిబందనల ప్రకారం విద్యుత్ శాఖనే వారి వాహనం ద్వారా డీపీ సరఫరా చేయాలి. కాని స్వంత ఖర్చులతో డీపీ తెచ్చుకున్నారు, బోల్టాలు, మెటీరియల్ మొత్తం రైతులే తెచ్చుకున్నారు. అర్త్ గుంతలు కూడ తవ్వుకున్నారు. కాని ఇంతవరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. గ్రామంలో ఇటువంటి రైతులు నలుగురు ఉన్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్‌మ అధికారుల చుట్టు ప్రదక్షణలు చేస్తున్నా.. మెటీరియల్ రాలేదని, ఇతరత్రా కారణాలతో జాప్యం చేస్తున్నారు.
–ఎర్రిస్వామి, బసినేపల్లి, మద్దికెర మండలం