బనగానపల్లె రూరల్: పసుపల గ్రామ సమీపంలో బుధవారం ఉదయం పిడుగుపడి ఐదు జీవాలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన మద్దిలేటిస్వామికి వంద జీవాలు ఉన్నాయి. ఉదయం పసుపల గ్రామ సమీపంలోని పోలిక కొండ వద్ద జీవాలు మేత మేస్తుండగా అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఆదే సమయంలో పిడుగు పడటంతో ఐదు జీవాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు మద్దిలేటిస్వామి తెలిపారు. వీటి విలువ సుమారు రూ.40 వేలు ఉంటాయన్నారు.
నందవరం: గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సచివాలయాలపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో అందులో పని చేసే ఉద్యోగులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు నాగలదిన్నె గ్రామంలోని సచివాలయ ఉద్యోగులే నిదర్శనం. గ్రామంలో ఒకే చోట సచివాలయం 1, 2 ఉన్నాయి. ప్రస్తుతం రెండు సచివాలయాల్లో దాదాపు 14 మంది విధులు నిర్వహిస్తున్నారు. కాగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి వివిధ పనుల మీద ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అయినా 11 గంటలైనా సచివాలయానికి తాళం కూడా తీయలేదు. 11. 40 గంటల తర్వాత ఒకరిద్దరు రావడం మొదలు పెట్టారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కొందరు పోయారని చెబుతుండగా, మిగతా వారిలో కొందరు ఆలస్యంగా రావడంపై ప్రజలు మండిపడ్డారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం
కల్లూరు: క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి అన్నారు. బుధ వారం కల్లూరు మండలం చిన్నటేకూరులోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌లో జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లాకు చెందిన ఖోఖో, వాలీబాల్, కబడ్డీ క్రీడాకారులు ప్రతిభకనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, ప్రిన్సిపాల్ వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాఘవేంద్ర, పలువురు ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పాల్గొన్నారు.
పిడుగుపాటుకు ఐదు జీవాలు మృతి
పిడుగుపాటుకు ఐదు జీవాలు మృతి