
శరవేగంగా మోదీ పర్యటన ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన కర్నూలు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చకచకగా సాగుతున్నాయి. నన్నూరు టోల్‌గేటు దగ్గర ఉన్న రాగమయూరి వద్ద ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగ సభ, హెలిపాడ్, 11 చోట్ల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో పనులు వేగం పుంజుకుంటున్నాయి. అధికారులు ఇతర జిల్లాల నుంచి జేసీబీలు, ఇతర పరికరాలతోపాటు కూలీలను తీసుకొచ్చి పనులను వేగవంతం చేశారు. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఉదయం, సాయంత్రం దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి టీజీ భరత్ కూడా పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు. సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన్న సత్యనారాయణరాజు కూడా బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు.
తాత్కాలిక ఆసుపత్రులు
ఏర్పాటు చేయండి..
బహిరంగ సభ ప్రాంగణంలో వీవీఐపీల కోసం 10 పడకలు, ప్రజల కోసం 20 పడకల తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు. పార్కింగ్ ప్రాంతాల్లో రెండు బేసిక్ లైఫ్ సపోర్టెడ్ అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచడంతోపాటు మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. హెలిపాడ్, ఓర్వకల్ పీహెచ్‌సీల వద్ద స్పెషలిస్టు వైద్యులు, ఎమర్జెన్సీ మెడికల్ బృందాలు, స్ట్రెచర్లు, వీల్ చైర్లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ శాంతి కళను ఆదేశించారు.

శరవేగంగా మోదీ పర్యటన ఏర్పాట్లు

శరవేగంగా మోదీ పర్యటన ఏర్పాట్లు

శరవేగంగా మోదీ పర్యటన ఏర్పాట్లు